How to Make Chicken Fry Recipe Easy ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి
How to Make Chicken Fry Recipe Easy ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి
ఒక కేజీ చికెన్ కి కావలసిన పదార్దలు:-
| మిర్చి | 2 |
| ఉల్లిపాయలు | 3 |
| బిర్యాని – ఆకు | 2 |
| నిమ్మకాయ | సగం |
| టమాటా | 1 |
| లవంగాలు | 5 |
| యాలకులు | 5 |
| దాల్చిన చెక్క | 1 ముక్క |
| పసుపు | చిటికెడు |
| అల్లం వెల్లుల్లి | 2 spoons |
| కారం | తగినంత |
| ఉప్పు | తగినంత |
| ధనియాలు | 2 spoons |
| కుడుక | చిన్న ముక్క |
| ఆయిల్ | తగినంత |
| కొత్తిమీర | కొంచెం |
తయారుచేయు విధానం:-
ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి అందులో కి ఉప్పు, కారం, నిమ్మరసం వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
మిక్సీ తీసుకొని అందులో వేయించిన ధనియాలు , యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
టమాటా కూడా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి.
ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, మిర్చి వేసి కాస్త ఫ్రై చేయాలి.
అలా ఫ్రై చేసిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్, పసుపు వేసి బాగా వేయించాలి.
అందులోకి గ్రైండ్ చేసిన టమోటా కూడా వేయాలి, అలాగే మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసి బాగా వేయించాలి.
వేగిన తర్వాత చికెన్ వేసి కలపాలి.
మూతపెట్టి 10 నిమిషాలు స్టౌ పైన ఉడికించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర వేయాలి.
మీకు ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.

