How to Make Simple and Easy Dhaba Style Chicken Curry నోరూరించే టేస్టీ టేస్టీ దాబా స్టైల్ చికెన్ కర్రీ
Simple and Easy Dhaba Style Chicken Curry నోరూరించే టేస్టీ టేస్టీ దాబా స్టైల్ చికెన్ కర్రీ
కావలసిన పదార్థాలు
| చికెన్ | 1/2 Kg |
| బిర్యానీ ఆకులు | 2 |
| పచ్చిమిర్చి | 2 |
| ఉల్లిపాయలు | 2 big size |
| లవంగాలు | 4 |
| యాలకులు | 3 |
| టమాటా | 2 big size |
| పెరుగు | 1/2 cup |
| దాల్చిన చెక్క | 2 to 3 |
| మిరియాలపొడి | 1 Spoon |
| జీలకర్ర పొడి | 1 Spoon |
| అల్లం వెల్లుల్లి పేస్ట్ | 1 Spoon |
| కొబ్బరి పొడి | 1 Spoon |
| పసుపు | 1 Spoon |
| నిమ్మకాయ | 1 |
| కారం | 8 spoons |
| ఆయిల్ | తగినంత |
| ఉప్పు | తగినంత |
| కొత్తిమీర | సరిపడినంత |
| ధనియాల పొడి | 1 Spoon |
| గరం మసాలా | 1 Spoon |
మ్యారినేట్ కి కావలసిన పదార్థాలు
| ఉప్పు | తగినంత |
| నిమ్మరసం | 1 |
| పసుపు | చిటికెడు |
| అల్లం వెల్లుల్లి పేస్ట్ | 1 spoon |
| పెరుగు | 1/2 cup |
| ధనియాల పొడి | 1 Spoon |
ముందుగా చికెన్ మ్యారినేట్ చేయాలి
ముందుగా చికెన్ తీసుకొని బాగా కడగాలి.
చికెన్ లోకి కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి వేసి అరగంట మ్యారినేట్ చేయాలి.
తయారు చేసే విధానం
ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి మరి గాక అందులో మిర్చి, ఉల్లిపాయముక్కలు, బిర్యానీ ఆకు వేసి బాగా వేయించాలి.
కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
రెండు నిమిషాల తర్వాత చికెన్ వేసి ఫ్రై చేయాలి.
తర్వాత పది నిమిషాలు చికెన్ ని బాగా ఉడకనివ్వాలి.
చికెన్ ఉడికిన తర్వాత దాల్చినచెక్క, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి.
ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ (stove off ) చేసి కొత్తిమీర వేయాలి.
ఎంతో రుచిగా ఉండే నోరూరించే టేస్టీ టేస్టీ దాబా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయినట్లే.

